1970 : పద్మశ్రీ టబు (తబస్సుమ్ ఫాతిమా హష్మీ) జననం. భారతీయ సినీ నటి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1970-11-04”
Event Type: జననం
1991-11-04
1991 : విద్యుల్లేఖ రామన్ జననం. భారతీయ తెలుగు మరియు తమిళ చిత్రాలలో కనిపించే నటి. థియేటర్ ఆర్టిస్ట్ గా పలు నాటకాలలో నటించింది. నటుడు మోహన్ రామన్ కుమార్తె. గౌతమ్ మీనన్ యొక్క నీతానే ఎన్ పొన్వసంతం తో అరంగేట్రం చేసింది. ఎడిసన్, నంది, సంతోషం అవార్డులు అందుకుంది.
1906-11-03
1906 : పద్మ భూషణ్ పృథ్వీరాజ్ కపూర్ జననం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, నిర్మాత, రచయిత, దర్శకుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్’ (IPTA) వ్యవస్థాపక సభ్యుడు. పృథ్వీ థియేటర్స్ స్థాపించాడు.
1618-11-03
1618 : అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ ముహమ్మద్ ఔరంగజేబు ఆలంగీర్ జననం. షాజహాన్ 3వ కుమారుడు. ఆఖరి మొఘల్ చక్రవర్తిగా 1658 నుంచి 1707 వరకు రాజ్యం చేసాడు. అత్యంత వివాదాస్పదమైన మరియు క్రూరమైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఔరంగజేబు కాలంలో మొఘల్ సామ్రాజ్యం అత్యంత విస్తీర్ణం సాధించింది. ఇతర మతాల వారిని నానా కష్టాలు పెట్టి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. జిజియా పన్ను వసూలు చేసి చెడ్డపేరు తెచ్చుకొని మొఘల్ సామ్రాజ్యం పతనానికి కారకుడయ్యాడు. మరాఠా రాజు శంభాజీ ని ముక్కలు చేసి నదిలో విసిరేశాడు. 9 వ సిక్కు గురువు గురుతేజ్ బహదూర్ ను తల నరికించి చంపాడు. షాజహాన్ పెద్ద కుమారుడు దారా షికో ను ఊరి తీయించాడు.
1688-11-03
1688 : జై సింగ్ II జననం. జైపూర్ కోటను స్థాపించి తన రాజధానిగా చేసుకున్నాడు. 29వ కచ్వాహా పాలకుడు. 11 ఏళ్లకే అంబర్ కు రాజయ్యాడు. జంతర్ మంతర్ అబ్జర్వేటరీలను ప్రారంభించాడు. యూక్లిడ్ యొక్క “ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ” ను సంస్కృతంలోకి అనువదించాడు. సవాయి, సరమద్-ఇ-రజహా-ఇ-హింద్, రాజ రాజేశ్వర్, శ్రీ శంతను జీ, మహారాజా సవాయి బిరుదులు పొందాడు.
1933-11-03
1933 : భారతరత్న అమర్త్య కుమార్ సేన్ జననం. భారతీయ ఆర్ధికవేత్త, తత్త్వవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు. Continue reading “1933-11-03”
1935-11-03
1935 : కళైమామణి జిక్కి (పిల్లవాలు కృష్ణవేణి నాయుడు) జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని. Continue reading “1935-11-03”
1948-11-02
1948 : జ్యోతి లక్ష్మి (లక్ష్మీ) జననం. భారతీయ సినీ నటి, శృంగార నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటి జయమాలిని సోదరి. 30 సినిమాలలో కధానాయిక పనిచేసింది. Continue reading “1948-11-02”
1865-02-11
1865 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం. భారతీయ తెలుగు సాహితీవేత్త. సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన నరసింహారావును పాఠకలోకం ‘కవిశేఖరుడ’నీ, ‘అభినవ కాళిదాసు’ అనీ, ‘ఆంధ్ర అడిసన్’ అనీ, ‘ఆంధ్ర షేక్ స్పియర్’ అనీ బిరుదులతో అభినందించింది.
1981-11-02
1981 : ఈషా డియోల్ తఖ్తానీ జననం. భారతీయ హిందీ నటి, మోడల్, టెలివిజన్ ప్రెజంటర్. నటులు, రాజకీయవేత్తలు ధర్మేంద్ర మరియు హేమ మాలినిల కుమార్తె. కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో అరంగేట్రం చేసింది. ఫిల్మ్ ఫేర్, బాలీవుడ్ మూవీ, స్టార్ స్క్రీన్, ఐఐఎఫ్ఎ అవార్డులను పొందింది.