మరణం – పేజీ 90 – On This Day  

2020-11-23

2020 : పద్మ భూషణ్ తరుణ్ గొగోయ్ మరణం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 3వ ముఖ్యమంత్రి. Continue reading “2020-11-23”

2006-11-22

2006 : పద్మ భూషణ్ అసీమా చటర్జీ (అసీమా ముఖర్జీ) మరణం. భారతీయ రసాయన శాస్త్రవేత్త, రాజకీయవేత్త. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును పొందిన మొదటి మహిళ. పద్మభూషణ్ అవార్డు అందుకొన్న మొదటి మహిళా శాస్త్రవేత్త. భారతీయ విశ్వవిద్యాలయం నుండి సైన్స్ లో డాక్టరేట్ ఆఫ్ సైన్స్ పొందిన మొదటి మహిళ. Continue reading “2006-11-22”

2016-11-22

2016 : పద్మ విభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం. భారతీయ కర్నాటక గాయకుడు, సంగీత విద్వాంసుడు, వాయిద్యకారుడు, నేపథ్య గాయకుడు, స్వరకర్త, పాత్రధారి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “2016-11-22”

1996-11-21

1996 : మొహమ్మద్ అబ్దుస్ సలమ్ మరణం. పాకిస్తానీ సిద్దాంత భౌతిక శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి పాకిస్తానీయుడు. సైన్స్ విభాగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి ముస్లిం. ఏ విభాగంలోనైనా ఇస్లామిక్ దేశం నుంచి నోబెల్ బహుమతి అందుకున్న రెండవ వ్యక్తి. Continue reading “1996-11-21”

1970-11-21

1970 : భారతరత్న సి వి రామన్ (చంద్రశేఖర వెంకట రామన్) మరణం. భారతీయ భౌతిక శాస్త్రవేత్త. లెనిన్ శాంతి బహుమతి గ్రహీత. నోబెల్ బహుమతి అందుకున్న రెండవ భారతీయుడు. ‘రామన్‌ ఎఫెక్ట్‌’ (రామన్ స్కాటరింగ్) ను కనిపెట్టాడు. Continue reading “1970-11-21”

2013-11-21

2013 : వడ్డే రమేష్ మరణం. భారత తెలుగు సినీ నిర్మాత. విజయమాధవి పిక్చర్స్ అధినేతగా ప్రసిద్ధి గాంచిన ఆయన హిందీ సినిమాలు కూడా నిర్మించారు. హీరో వడ్డే నవీన్ ఈయన కుమారుడే.

1962-11-18

1962 : మేజర్ షైతాన్ సింగ్ భాటి మరణం. భారతీయ ఆర్మీ అధికారి. పరమ వీర చక్ర గ్రహీత. భారత్ చైనా యుద్ధ సమయంలో తెల్లవారుజామున చైనీయులు వెనక నుండి దాడి చేయడంతో ఎలాంటి కవరింగ్ లేకుండా యుద్దంలోకి వెళ్ళి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. Continue reading “1962-11-18”

1978-11-18

1978 : పద్మ భూషణ్ ధీరేన్ గంగూలీ (ధీరేంద్ర నాథ్ గంగూలీ) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ‘ఇండో బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ’, ‘బ్రిటిష్ డొమినియన్ ఫిల్మ్స్’, ‘లోటస్ ఫిల్మ్ కంపెనీ’ నిర్మాణ సంస్థల వ్యవస్థాపకుడు.

2018-11-17

2018 : పద్మశ్రీ అలిక్ పదంసీ మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, యాడ్ ఫిల్మ్ నిర్మాత. భారత్‌లో అంతర్జాతీయ వాణిజ్య ప్రకటనల సంస్థ ‘లింటాస్’ సియిఓ. ‘గాంధీ’ సినిమాలో మహమ్మద్ అలీ జిన్నా పాత్రలో ప్రసిద్ధి చెందాడు. తెలుగు సినీనటి షాజన్ పదంసీ ఈయన కుమార్తె. Continue reading “2018-11-17”

2015-11-17

2015 : హిందూ హృదయ్ సామ్రాట్ అశోక్ సింఘాల్ మరణం. భారతీయ హిందూ జాతీయవాది, గాయకుడు. విశ్వ హిందూ పరిషత్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు. ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి ఇన్‌ఛార్జ్‌. హిందుస్తానీ సంగీతంలో శిక్షణ పొందిన గాయకుడు. ధర్మశ్రీ పురస్కారం లభించింది.