మరణం – పేజీ 89 – On This Day  

2015-11-25

achanta venkataratnam naidu2015 : ఆచంట వెంకటరత్నం నాయుడు మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు. ఎన్.టి.ఆర్. రంగస్థల పురస్కారం గ్రహీత. దుర్యోధన, జలంధర, ద్రోణ, అశ్వధామ పాత్రలకు ప్రసిద్ధి చెందాడు. Continue reading “2015-11-25”

1971-11-17

1971 : పద్మశ్రీ దేబకీ కుమార్ బోస్ మరణం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. ‘డెబాకె ప్రొడక్షన్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. Continue reading “1971-11-17”

1974-11-25

1974 : మహా త్రాయ్ సితు యు థాంట్ మరణం. దిగువ బర్మ (ప్రస్తుత మయన్మార్) దౌత్యవేత్త. ఐక్యరాజ్యసమితి యొక్క మూడవ సెక్రటరీ జనరల్. ఆసియా ఖండం నుంచి ఈ పదవిని అధిష్టించిన తొలి వ్యక్తి. రికార్డు స్థాయిలో 10 సంవత్సరాల ఒక నెల పాటు పదవిలో కొనసాగాడు. ఆయన జవహర్‌లాల్ నెహ్రూ అవార్డుతో పాటు అనేక ఇంటర్నేషనల్ అవార్డులు, గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

1964-11-25

1964 : పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం. భరతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. Continue reading “1964-11-25”

1984-11-25

1984 : యశ్వంతరావు బల్వంతరావు చవాన్ మరణం. భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. బొంబాయి రాష్ట్ర 3వ ముఖ్యమంత్రి. భారతదేశ 5వ ఉప ప్రధానమంత్రి.

Continue reading “1984-11-25”

1963-11-24

1963 : దాదాసాహెబ్ కన్నమ్వార్ (మరోత్రావ్ శంబ్షియో కన్నమ్వార్) మరణం. భారతీయ రాజకీయవేత్త. మహారాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. మొదటి లోకసభ సభ్యుడు. ఆయన గౌరవార్ధం ముంబైలోని విక్రోలి (తూర్పు)లోని కన్నమ్వార్ నగర్ పేరు ఆయన పేరు పెట్టారు. కెడికె కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, నాగ్పూర్ అతని గౌరవార్థం పేరు పెట్టబడింది. చంద్రాపూర్‌లోని కాంగ్రెస్-భవన్‌కు మహారాష్ట్ర మాజీ సీఎం పేరు పెట్టారు.

1916-11-24

1916 : హిరామ్ స్టీవెన్స్ మాగ్జిమ్ మరణం. బ్రిటీష్ అమెరికన్ ఆవిష్కర్త. మొట్టమొదటి ఆటోమేటిక్ మెషిన్ గన్ ‘మాగ్జిమ్ గన్’ సృష్టికర్త. ఎలెక్ట్రిక్ లైట్లు, కార్బన్ కండక్టర్ల తయారీ మీద పేటెంట్లు పొందాడు.

1675-11-24

1675 : గురు తేగ్ బహదూర్ (త్యాగ్ మాల్ ఖత్రీ) మరణం. 10 మంది సిక్కు గురువుల్లో తొమ్మిదవ వాడు. తొలిగురువు నానక్ స్ఫూర్తితో ఆయన రాసిన 115 కవితలు గురు గ్రంథ్ సాహిబ్ లో ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని ఆనందపూర్ సాహిబ్ అనే నగరాన్ని స్థాపించాడు. ఇస్లాంలోకి మారేందుకు తిరస్కరించినందుకు గురు తేగ్ బహదూర్ ను ముఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఢిల్లీలో బహిరంగంగా తల నరికించి చంపాడు.

2018-11-24

2018 : అంబరీష్ (మలవల్లి హుచ్చెగౌడ అమర్‌నాథ్) మరణం. భారతీయ సినీ నటుడు, రాజకీయవేత్త. కన్నడ రెబెల్ స్టార్ గా ప్రసిద్ది చెందాడు. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషలలొ పనిచేశాడు. సమాచార ప్రసార శాఖ – కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు. నటి సుమలత ను వివాహం చేసుకున్నాడు.

2006-11-23

2006 : కళైమామణి దాసరి యోగానంద్ మరణం. భారతీయ సినీ దర్శకుడు, రచయిత, స్వాతంత్ర్య కార్యకర్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “2006-11-23”