2012 : హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ (బాల్ కేశవ్ ఠాక్రే) మరణం. భరతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, కార్టూనిస్ట్. ‘శివసేన’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. యునైటెడ్ మహారాష్ట్ర నుండి మరాఠీ ప్రజల ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిండు. ‘సామ్నా’ పత్రిక స్థాపించాడు. 1993 ముంబై అల్లర్లలో ఈ పత్రిక హింసను ప్రేరేపించింది. Continue reading “2012-11-17”
Event Type: మరణం
1928-11-17
1928 : పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంపాదకుడు, రచయిత, రాజకీయవేత్త. లాల్ బాల్ పాల్ త్రయంలో ఒకడు. సైమన్ కమిషన్ వ్యతిరేకించాడు. ‘హిందూ అనాథ రిలీఫ్ మూవ్‌మెంట్’ వ్యవస్థాపకుడు. లాహోర్ ఆధారిత ఆర్య గెజెట్ వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, లక్ష్మి ఇన్సూరెన్స్ కంపెనీల స్థాపనలో ప్రముఖ పాత్ర వహించాడు.
1982-11-15
1982 : భారతరత్న వినోబా భావే (వినాయక్ నరహరి భావే) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, తత్వవేత్త. రామన్ మెగసెసే అవార్డు మొట్టమొదటి గ్రహీత. భూదాన్ ఉద్యమానికి ప్రసిద్ది చెందాడు.
1967-11-14
1967 : పద్మ భూషణ్ సి కె నాయుడు (కొట్టారి కనకయ్య నాయుడు) మరణం. భారతీయ క్రికెటర్. భారత క్రికెట్ జట్టుకు టెస్ట్ మ్యాచ్‌లలో మొదటి కెప్టెన్. Continue reading “1967-11-14”
1986-10-23
1986 : ఎడ్వర్డ్ అడెల్బర్ట్ డోయిసీ మరణం. అమెరికన్ బయోకెమిస్ట్. నోబెల్ బహుమతి గ్రహీత. విటమిన్ ‘కె’ మరియు దాని రసాయన నిర్మాణాన్ని కనుగొన్నాడు. అందుకుగాను హెన్రిక్ డ్యామ్‌తో ఫిజియాలజీ మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు.
2010-11-13
2010 : పద్మశ్రీ డివిఎస్ రాజు (దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు) మరణం. భారతీయ సినీ నిర్మాత. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు. నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్. తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడు. Continue reading “2010-11-13”
1946-11-12
1946 : భారతరత్న మదన్ మోహన్ మాలవ్య మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, రాజకీయవేత్త. ‘పండిట్’, ‘మహమాన’ గా గౌవరింపబడ్డాడు. అఖిల భారత హిందూ మహాసభ వ్యవస్థాపకుడు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సహ వ్యవస్థాపకుడు. Continue reading “1946-11-12”
1974-11-11
1974 : రమణా రెడ్డి (తిక్కవరపు వెంకట రమణా రెడ్డి) మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, మెజీషియన్.
1970-11-11
1970 : పద్మ భూషణ్ మాడపాటి హనుమంతరావు మరణం. భారతీయ రాజకీయవేత్త, కవి, రచయిత, న్యాయవాది. హైదరాబాద్ నగరానికి తొలి మేయర్. ఆంధ్రపితామహుడు బిరుదు పొందాడు. ఆంధ్రజనసంఘం, ఆంధ్రమహాసభ ప్రజా సంఘాల వ్యవస్థాపక సభ్యుడు.
2013-11-10
2013 : పద్మశ్రీ బిజ్జీ (విజయదాన్ దేథా) మరణం. భారతీయ రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. రాజస్థాన్ రత్న గ్రహీత. నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యాడు.