మరణం – పేజీ 92 – On This Day  

2020-11-10

2020 : జీడిగుంట రామచంద్ర మూర్తి మరణంప్రముఖ సాహితీవేత్త. రేడియో నాటకాలు రాయడం, వాటిల్లో నటించడం; కథలు, నాటికలు, నవలలు, సినిమాలకు సంభాషణలు, అనువాద వ్యాసాల రచన. ఇలా అన్నింట్లో తన కలానికున్న సత్తా చాటారు జీడిగుంట రామచంద్రమూర్తి. నటుడు వరుణ్ సందేశ్ ఈయన మనమడు.

2019-11-10

2019 : టి.ఎన్.శేషన్ (తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్) మరణం. పదవీవిరమణ చేసిన 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ అధికారి. 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనరుగా పనిచేశాడు.  ఐ.ఎ.ఎస్ అధికారిగా 18వ భారత కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేసాడు. రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టాడు.

2011-11-09

Har Gobind Khorana2011 : పద్మ విభూషణ్ హర్ గోవింద్ ఖోరానా మరణం. భారతీయ అమెరికన్ జీవ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. Continue reading “2011-11-09”

2005-11-09

2005 : కె ఆర్ నారాయణన్ (కొచెరిల్ రామన్ నారాయణన్) మరణం. భారతీయ రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. భారతదేశ 10వ రాష్ట్రపతి. ఈ పదవి పొందిన మొదటి దళితుడు. 9వ ఉపరాష్ట్రపతి. జపాన్, యుకె, థాయిలాండ్, టర్కీ, చైనా, యుఎస్ఎ లో భారత రాయబారి.

1977-11-08

1977 : పద్మ భూషణ్ బి ఎన్ రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి) మరణం. భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రంగస్థల నటుడు. ఆయన ప్రతిభను ప్రత్యక్షంగా చూసిన గాంధీజీ ఆయన్ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఆయన సృష్టించిన మల్లీశ్వరి బహుళ ప్రజాదరణ పొందింది. దాదాసహేబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణ భారతీయుడు. కలైమామణి, పద్మభూషణ్ పురస్కారాలతో పాటు  గౌరవ డాక్టరేట్లు, శాసనమండలి సభ్యత్వం లభించాయి. 

2012-11-08

2012 : జస్టిస్ సర్దార్ అలీఖాన్ మరణం. భారతీయ న్యాయ నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. జాతీయ మైనారిటీ కమిషన్‌ ఛైర్మన్‌.

Continue reading “2012-11-08”

2013-11-08

2013 : ఎ వి ఎస్ (ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం) మరణం. భారతీయ సిని నటుడు, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్ట్, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త, పాత్రికేయుడు. నంది అవార్డు గ్రహీత. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. Continue reading “2013-11-08”

2000-11-07

2000 : భారతరత్న సిఎస్ (చిదంబరం సుబ్రమణ్యం) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. మహారాష్ట్ర 15వ గవర్నర్‌. Continue reading “2000-11-07”

1985-11-06

Sanjeev Kumar Harihar Jethalal Jariwala1985 : సంజీవ్ కుమార్ (హరిహర్ జెఠాలాల్ జరీవాలా) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1985-11-06”

2011-11-05

2011 : భారతరత్న భూపేన్ హజారికా (భూపేంద్ర కుమార్ హజారికా) మరణం. భారతీయ అస్సామీ నేపథ్య గాయకుడు, గీత రచయిత, సంగీతకారుడు, కవి, చిత్రనిర్మాత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. ‘సుధా కొంతో’ బిరుదు పొందాడు.