1656 : మొహమ్మద్ ఆదిల్ షా మరణం. బీజాపూర్ యొక్క ఏడవ పాలకుడు. ఆయన పాలనలో, అహ్మద్‌నగర్ సుల్తానేట్‌కు వ్యతిరేకంగా మొఘల్ ప్రచారాలకు సహాయం చేయడమేగాక వారితో శాంతి ఒప్పందంపై సంతకం చేశాడు. మొఘలుల చేత షా అనే బిరుదు పొందిన ఏకైక బీజాపూర్ మహారాజు. ఛత్రపతి శివాజీ బీజాపూర్ కు చెందిన తోర్న కోటను ఆక్రమించినపుడు 2 సార్లు యుద్దం చేసి ఓడిపోయాడు. కానీ మూడోసారి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి సిద్ధి జోహర్ అనే సైన్యాధ్యకుడ్ని పంపించి శివాజీ ని సంధికి వచ్చేలా చేశాడు.
Event Type: మరణం
1947-11-03
1947 : మేజర్ సోమనాథ్ శర్మ మరణం. భారతీయ సైనికాధికారి. పరమవీర చక్ర (PVC) పొందిన మొదటి భారతీయుడు. శ్రీనగర్ విమానాశ్రయాన్ని రక్షించడంలో చేసిన చర్యలకు మరణానంతరం ఈ పురస్కారం లభించింది.
1998-11-03
1998 : పి ఎల్ నారాయణ (పుదుక్కోటై లక్ష్మీ నారాయణ) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, రచయిత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1998-11-03”
2015-11-02
2015 : కొండవలస లక్ష్మణరావు మరణం. భారతీయ తెలుగు రంగస్థల నటుడు, సినీ నటుడు. నంది అవార్డు గ్రహీత.
2012-11-02
2012 : కింజరాపు ఎర్రన్నాయుడు మరణం. భారతీయ రాజకీయవేత్త. ‘భవానీ చారిటబుల్ ట్రస్ట్’ వ్యవస్థాపకుడు. 11, 12, 13, 14వ లోక్ సభ సభ్యుడు. Continue reading “2012-11-02”
1996-11-01
1996 : జె.ఆర్. (జూనియస్ రిచర్డ్ జయవర్ధనే) మరణం. శ్రీలంక రాజకీయవేత్త. 2వ అధ్యక్షుడు, 7వ ప్రధాన మంత్రి, సిలోన్ (ఇప్పుడు శ్రీలంక) లో జాతీయవాద ఉద్యమానికి నాయకుడు.
1989-11-01
1989 : హరనాథ్ (బుద్దరాజు వెంకట అప్పల హరనాథ్ రాజు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు. Continue reading “1989-11-01”
2019-10-31
2019 : గీతాంజలి (మణి) మరణం. భారతీయ తెలుగు నటి, నర్తకి, టీవి ప్రజంటర్, రాజకీయవేత్త. తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ వంటి బహుళ భాషలలో 500 చిత్రాలలో నటించింది. ప్రముఖ నటుడు జి.రామకృష్ణ భార్య. నంది అవార్డు కమిటీలో సభ్యురాలిగా పనిచేసింది. నంది అవార్డు, రైలింగీ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.
1984-10-31
1984 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) మరణం. భారతీయ రాజకీయవేత్త. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ.
1990-10-30
1990 : పద్మ విభూషణ్ శాంతారాం రాజారాం వణకుద్రే మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. Continue reading “1990-10-30”