మరణం – పేజీ 94 – On This Day  

1963-10-30

1963 : పసుంపొన్ ఉక్కిరపాండి ముత్తురామలింగ తేవర్ మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, ఆధ్యాత్మికవేత్త, రైతు, రాజకీయవేత్త. తమిళనాడు ‘తేవర్’ కమ్యూనిటీ మూలపురుషుడు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జాతీయ డిప్యూటీ ఛైర్మన్‌. సుభాస్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దక్షణ భారత ఓట్లన్నీ సమీకరించి మహాత్మా గాంధీ సపోర్టుతో వచ్చిన పట్టాభి మీద విజయం సాధించేలా చేశాడు.

1883-10-30

1883 : దయానంద సరస్వతి (మూల శంకర్ తివారీ) మరణం. భారతీయ ఆధ్యాత్మికవేత్త, తత్వవేత్త, సామాజిక గురువు. ‘ఆర్య సమాజ్’ వ్యవస్థాపకుడు. అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలను ఎదురించి పోరాడాడు. హిందు ధర్మ సంస్థాపనకు పాటుపడ్డాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వరాజ్యం కోసం “భారతీయుల కోసం భారతదేశం” అని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి దయానంద.

1910-10-30

1910 : జీన్ హెన్రీ డునాంట్ మరణం. స్విస్ మానవతావాది, వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్త. ‘రెడ్ క్రాస్’ వ్యవస్థాపకుడు. మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. Continue reading “1910-10-30”

2021-10-29

2021 : కర్ణాటక రత్న పునీత్ రాజ్‌కుమార్ మరణం. భారతీయ కన్నడ సినీ నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్, పరోపకారి. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. యువరత్న, పవర్ స్టార్ బిరుదులు పొందాడు. Continue reading “2021-10-29”

1988-10-29

1988 : పద్మ విభూషణ్ కమలాదేవి ఛటోపాధ్యాయ్ (కమలాదేవి ధరేశ్వర్) మరణం. భారతీయ స్వాతంత్య్ర సమరయోధురాలు, సంఘ సంస్కర్త, సినీ నటి, రచయిత్రి, రాజకీయవేత్త. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. భారతదేశంలో రాజకీయ పదవికి పోటీ చేసిన మొదటి మహిళ.

Continue reading “1988-10-29”

1811-10-28

1811 : యశ్వంత్ రావ్ హోల్కర్ మరణం. 1799 నుండి 1807 వరకు మరాఠా సామ్రాజ్యానికి మహారాజు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ని ఎదిరించి నిలబడ్డాడు. మొఘల్ చక్రవర్తి షా ఆలం ఆయనకు “మహారాజాధిరాజా రాజ్ రాజేశ్వర్ అలీజా బహదూర్” బిరుదును ఇచ్చాడు. యశ్వంత్ రావ్ ప్రతిభావంతులైన సైనిక నాయకుడు, అకౌంటెన్సీలో విద్యావంతుడు మరియు పెర్షియన్, మరాఠీ భాషల్లో పట్టు ఉంది. 35సం. వయసులో అధిక రక్తపోటు, ఒత్తిడితో మరణించాడు.

1627-10-28

1627 : జహంగీర్ (మీర్జా నూర్-ఉద్-దిన్ బేగ్ మొహమ్మద్ ఖాన్ సలీం) మరణం. భారతదేశాన్ని పాలించిన నాల్గవ మొఘల్ చక్రవర్తి. అక్బర్ కు కుమారుడు, షాజహాన్ కు తండ్రి, జహాంగీర్ కు నూర్ జహన్ 20వ భార్య. Continue reading “1627-10-28”

1911-10-13

sister-nivedita-Margaret-Elizabeth-Noble1867 : సిస్టర్ నివేదిత (మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్) మరణం. ఐరిష్ భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త, విద్యావేత్త, రచయిత్రి, తత్వవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశ మొదటి జాతీయ జెండా రూపకర్త. స్వామి వివేకానంద శిష్యురాలు. భారతదేశంలో హిందూమతాన్ని స్వీకరించిన మొదటి పాశ్చాత్య మహిళ. లోకమాత, లయినెస్, ఛాంపియన్ ఆఫ్ ఇండియా, సిస్టర్ బిరుదులు పొందింది.

1605-10-27

1605 : అబుల్-ఫత్ జలాల్-ఉద్-దిన్ ముహమ్మద్ అక్బర్ (బద్రుద్దీన్ ముహమ్మదు అక్బరు) మరణం. అక్బర్ ది గ్రేట్, అక్బర్ 1 అని కూడా పిలుస్తారు. ఆయన 1556 నుండి 1605 వరకు భారతదేశాన్ని పరిపాలించిన మూడవ మొఘల్ చక్రవర్తి. కొందరు గంగానది నుండి కలుషితమైన నీరు తాగడం వలన అక్బర్ విరోచనాలతో మరణించినట్లు, మరికొందరు విష ప్రయోగం జరిగిందని విశ్వసిస్తున్నారు.

1940-10-27

1940 : గోండు బెబ్బులి కొమురం భీమ్ మరణం. భారతీయ గిరిజన నాయకుడు, తిరుగుబాటుదారుడు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడిన ఉద్యమకారుడు. జల్, జంగల్, జమీన్ (నీరు, అటవీ, భూమి) అనే నినాదంతో వీర మరణం పొందాడు.