జననం – పేజీ 162 – On This Day  

1926-11-23

1926 : పుట్టపర్తి సత్యసాయి బాబా (రత్నాకరం సత్యనారాయణ రాజు) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు, వేదాంతి, పరోపకారి, సంఘ సంస్కర్త. షిరిడీ సాయిబాబా పునర్జన్మగా చెప్పుకున్నాడు. ‘శ్రీ సత్య సాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్’ వ్యవస్థాపకుడు. నోట్లోంచి లోహాలు తీయడంపై అభియోగాలు ఉన్నాయి. Continue reading “1926-11-23”

1981-11-23

1981 : విష్ణు మంచు (మంచు విష్ణు వర్ధన్ బాబు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, విద్యావేత్త, సామాజిక కార్యకర్త. సినీ నటుడు మోహన్ బాబు తనయుడు. ‘మంచు విష్ణు ఆర్ట్ ఫౌండేషన్’ (VMAF) వ్యవస్థాపకుడు. ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సహ యజమాని. ‘మా అసోసియేషన్’ అధ్యక్షుడు. పర్యావరణ అవగాహన కోసం ‘ఆర్మీ గ్రీన్’ సామాజిక విభాగాన్ని ప్రారంభించాడు. Continue reading “1981-11-23”

1986-11-23

1986 : యువ సామ్రాట్ నాగ చైతన్య (అక్కినేని నాగ చైతన్య) జననం. భారతీయ సినీ నటుడు. నంది అవార్డు గ్రహీత. సినీ నటుడు అక్కినేని నాగార్జున కుమారుడు.

1979-11-22

1979 : శశాంక్ సిద్దంశెట్టి జననం. భారతీయ సినీ నటుడు.  తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో పనిచేశాడు. వెబ్ సిరీస్ లో పనిచేశాడు. ‘ఐతే’ చలనచిత్రంతో తెలుగు లో ఆరంగేట్రం చేశాడు. నంది అవార్డును గెలుచుకున్నాడు.

1989-11-22

1989 : త్రిధా చౌదరి జననం. భారతీయ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ఆమె ప్రధానంగా బెంగాలీ, తెలుగు, హిందీ చిత్రాలలో కనిపిస్తుంది. కలకత్తా టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 2011 టైటిల్ గెలుచుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క “మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్”లో 2020లో 13వ స్థానంలో నిలిచింది. వెబ్ సిరీస్ లో ఎక్కువ ప్రముక్యత సంపాదించుకుంది. స్టార్ పరివార్ అవార్డు అందుకుంది.

1948-11-22

1948 : ది మదర్ ఆఫ్ కొరియోగ్రాఫి ఇన్ ఇండియా సరోజ్ ఖాన్ (నిర్మలా కిషన్‌చంద్ సాధు సింగ్ నాగ్‌పాల్) జననం. భారతీయ సినీ నృత్య దర్శకురాలు, టెలివిజన్ ప్రజెంటర్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. బాలీవుడ్‌ మొదటి మహిళా కొరియోగ్రాఫర్‌.ది మదర్ ఆఫ్ డాన్స్/కొరియోగ్రాఫి ఇన్ ఇండియా బిరుదు పొందింది. Continue reading “1948-11-22”

1967-11-22

1967 : మార్క్ అలాన్ రుఫెలో జననం. అమెరికన్ నటుడు, నిర్మాత. మార్వెల్ వారి అవెంజర్స్, హల్క్ లాంటి చిత్రాల్లో బ్రూస్ బ్యానర్/హల్క్ పాత్ర పోషించినందుకు ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు, ప్రైమ్‌టైమ్ ఎమ్మీ, గోతం ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్లతో లాంటి అనేక అవార్డులు పొందాడు.

1984-11-22

1984 : స్కార్లెట్ ఇంగ్రిడ్ జాన్సన్ జననం. అమెరికన్ నటి. ఆమె 2018-2019లో ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందిన నటి. ఫోర్బ్స్ సెలబ్రిటీ 100 జాబితాలో అనేకసార్లు కనిపించింది. ఆమె సినిమాలు ప్రపంచవ్యాప్తంగా $14.3 బిలియన్లకు పైగా వసూలు చేశాయి. ఆమె అత్యధిక వసూళ్లు చేసిన బాక్సాఫీస్ స్టార్‌ లలో తొమ్మిదవ స్థానంలో ఉంది. మార్వెల్స్ అవెంజర్స్ సినిమా నటాషా/బ్లేక్ విడో గా ఎక్కువ పాపులారిటీ పొందింది. బ్రిటిష్ ఫిల్మ్ అకాడమీ అవార్డుతో సహ అనేక అవార్డులు అందుకుంది.

1995-11-22

1995 : ప్రియాంకా సింగ్ (సాయి తేజ) జననం. భారతీయ టెలివిజన్ ప్రజెంటర్, యుట్యూబర్, నటి. ఆమె ఒక ట్రాన్సజెండర్. ఆమె మారుపేరు పింకీ. జబర్దస్త్ షో తో కెరీర్ ను ప్రారంభించి అదిరింది, కామెడీ స్టార్స్ లాంటి షో లలో పాల్గొంది. ఆమె “బాలకృష్ణుడు” తో తన సినీరంగ ప్రవేశం చేసింది. తెలుగు బిగ్ బస్ 5 లో కంటెస్టెంట్.

1987-11-21

1987 : నేహా శర్మ జననం. భారతీయ నటి, మోడల్. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, పంజాబీ, చైనీస్ భాషా చిత్రాలలో పనిచేసింది. గూగుల్ జైట్జీస్ట్ ప్రచురణలో భారతదేశంలో అత్యంత వేగంగా ఫేమస్ అవుతున్న వ్యక్తుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 50 మంది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ గా స్థానం దక్కించుకుంటూనే ఉంది. హాటెస్ట్ ఫిమేల్ టైమ్స్ పోల్‌లో నంబర్ 1 సాధించింది. ప్రపంచంలోని 100 సెక్సీయెస్ట్ మహిళలు ఎఫ్హెచ్ఎం లో నంబర్ 7 లో నిలిచింది. చండీగఢ్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌లో 13వ స్థానంలో నిలిచింది.