1966 : రూపా గంగూలీ జననం. భారతీయ సినీ నటి, నేపథ్య గాయని, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. దూరదర్శన్ ధారావాహిక మహాభారత్‌లో ద్రౌపది పాత్రకు ప్రసిద్ది చెందింది. Continue reading “1966-11-25”
Event Type: జననం
1899-11-24
1899 : పద్మ భూషణ్ హీరాలాల్ శాస్త్రి జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు, రాజకీయవేత్త, విద్యావేత్త. రాజస్థాన్ మొదటి ముఖ్యమంత్రి. ‘జీవన్ కుటీర్’ వ్యవస్థాపకుడు. ‘బనస్థలి విద్యాపీఠ్’ వ్యవస్థాపకుడు. ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత జైపూర్ రాష్ట్రానికి ప్రధానమంత్రి. Continue reading “1899-11-24”
1936-11-24
1936 : సయ్యదా అన్వారా తైమూర్ జననం. భారతీయ రాజకీయవేత్త. అస్సాం 8వ ముఖ్యమంత్రి. అస్సాం రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి. భారతదేశంలో ఈ పదవి పొందిన మొదటి ముస్లిం మహిళ. Continue reading “1936-11-24”
1961-11-24
1961 : సుజాన్నా అరుంధతీ రాయ్ జననం. భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. ఆమె రాసిన ‘ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ ద్వారా బుకర్ ప్రైజు పొందిన మొట్టమొదటి భారతీయురాలు. “నర్మదా బచావో” ఆందోళనను సమర్ధిస్తూ ఆమె రాసిన “ది గ్రేటర్ కామన్ గుడ్” రచన వివాదాస్పదంగా మారింది. లన్నాన్ ఫౌండేషన్ సాంస్కృతిక అవార్డు, సిడ్నీ శాంతి బహుమతి, సాహిత్య అకాడెమీ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, నార్మన్ మెయిలర్ ప్రైజ్లు లభించాయి.
1622-11-24
1622 : లచిత్ బోర్ఫుకాన్ (లచిత్ డెకా) జననం. అహోమ్ రాజు చక్రధ్వజ సింఘా సర్వ సైన్యాధికారిగా లచిత్ బోర్ఫుకాన్‌ను నియమించిన వెంటనే, ఆక్రమణలో ఉన్న గౌహతిని తిరిగి పొందటానికి లచిత్ మొఘలులతో యుద్దం చేసి వారిని వెళ్ళగొట్టాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఓటమి తట్టుకోలేక అంబేర్ రాజా ‘రామ్ సింగ్ కచ్వాహా’ ఆధ్వర్యంలో బలమైన మొఘల్ సైన్య బృందాన్ని లచిత్ సైన్యాన్ని ఓడించడానికి పంపాడు. కానీ సారైఘాట్ యుద్ధంలో మొఘల్ సైన్యం ఘోర పరాజయం పాలైంది. గౌహతి రాజభవనంపై అహోం జెండాను తిరిగి స్థాపించిన ఘనత లచిత్ దే. అస్సాంలో ఈరోజును లచిత్ దినోత్సవం గా జరుపుకుంటారు.
1967-11-23
1967 : గ్యారీ కిర్‌స్టన్ జననం. దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. ఆయన భారత క్రికెట్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. కిర్‌స్టన్ 1993 మరియు 2004 మధ్య దక్షిణాఫ్రికా తరపున 101 టెస్ట్ మ్యాచ్‌లు మరియు 185 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. ఆయన భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో ఇండియా 2011 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
1984-11-23
1984 : అమృతా ఖాన్విల్కర్ మల్హోత్రా జననం. భారతీయ సినీ నటి, టెలివిజన్ ప్రెజంటర్, డాన్సర్. ఆమె హిందీ మరియు మరాఠీ సినిమాలలో పనిచేసింది. ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 10 లో ఆమె డ్యాన్స్ లో పాల్గొనడం ద్వారాప్రసిద్ధి చెందింది. ఆమె తన భర్త హిమ్మాంశూ ఎ. మల్హోత్రాతో కలిసి డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే యొక్క ఏడవ సీజన్‌ను గెలుచుకుంది. జీ టాకీస్ మహారాష్ట్రచి ఫేవరెట్ నాయికా ట్రోఫీ 2017 గెలుచుకుంది.
1965-11-23
1965 : బాబా సెహగల్ (హర్జీత్ సింగ్ సెహగల్) జననం. భారతీయ సినీ నటుడు, రాపర్, గాయకుడు, హాస్య నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషలలొ పనిచేశాడు. అల్బుమ్ లతో కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆయన మొదటి భారతీయ రాపర్‌గా పరిగణించబడ్డాడు. 2006 లో రియాలిటీ షో బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్.
1982-11-23
1982 : అనిల్ రావిపూడి జననం. భారతీయ తెలుగు సినీ రచయిత, దర్శకుడు. సైమ, సంతోషం అవార్డులను అందుకున్నాడు.
1967-11-23
1967 : రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ జననం. ఐపిఎస్ మాజీ అధికారి. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ మరియు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన రాష్ట్రపతిచే పోలీస్ పతకాన్ని మరియు తెలంగాణా ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నాడు.