మరణం – పేజీ 95 – On This Day  

2021-10-24

2021 : బొడ్డు రాజబాబు మరణం. భారతీయ తెలుగు సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. Continue reading “2021-10-24”

2010-10-24

2010 : చెరుకూరి లెనిన్ మరణం. భారతీయ ఆర్చర్ మరియు కోచ్. చెరుకూరి సత్యనారాయణ కుమారుడు. మలేషియా – ఆసియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో రజత పతకం, ఢిల్లీ – ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం, బ్యాంకాక్ – ఏషియన్ గ్రాండ్ పిక్స్‌లో రజత పతకం సాధించాడు.

1623-07-30

1623 : గోస్వామి తులసీదాస్ మరణం. రామనంది వైష్ణవ హిందూ సన్యాసి మరియు కవి. రాముడి పట్ల ఆయనకున్న భక్తికి ప్రసిద్ధి చెందారు.

1985-10-24

László József Schweiger laszlo biro1985 : లాస్లో బైరొ (లాస్లో జోజ్సెఫ్ ష్వీగర్) మరణం. హంగేరియన్ అర్జెంటీనా జర్నలిస్ట్, ఆవిష్కర్త. బాల్ పాయింట్ పెన్ను కనుగొన్నాడు.

2017-10-24

2017 : పద్మ విభూషణ్ గిరిజా దేవి మరణం. భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. మహా సంగీత సమ్మాన్ అవార్డు గ్రహీత. సేనియా, బెనారస్ ఘరానాకు ప్రసిద్ధి చెందింది.

Continue reading “2017-10-24”

1980-10-23

1980 : రేడియో అక్కయ్య (న్యాయపతి కామేశ్వరి) మరణం. బాలానందం వ్యవస్థాపకులు. విజయనగరం మహారాజా కళాశాలలో బి.ఎ. పాసైన మొట్టమొదటి మహిళ. న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) భార్య. మద్రాసులోని వెల్లింగ్టన్ టీచర్ ట్రైనింగ్ కాలేజీ లో ఉపాధ్యాయ శిక్షణ (ఎల్.టి.) పూర్తిచేశారు. భర్తకుతోడుగా, చెన్నై రేడియో కార్యక్రమాలలోను, బాల పత్రిక నిర్వహణలోను చురుగ్గా పాల్గొన్నారు.

2001-10-22

2001 : జి. రామకృష్ణ మరణం. భారతీయ చలనచిత్ర నటుడు. ఆయన తెలుగు, తమిళం మరియు మలయాళంతో సహా 200 కి పైగా చిత్రాలలో నటించాడు. అప్పటి కథానాయకి గీతాంజలి ఈయన భార్య.

1986-10-19

1986 : టంగుటూరి అంజయ్య మరణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి.

2006-10-19

2006 : కళైమామణి శ్రీవిద్య (శ్రీవిద్యా కృష్ణమూర్తి) మరణం. భారతీయ సినీ నటి, నేపధ్య గాయని, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ఆర్ కృష్ణమూర్తి, కర్ణాటక సంగీత గాయని ఎం.ఎల్. వసంతకుమారి ల కుమార్తె. Continue reading “2006-10-19”

1937-10-19

1937 : ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్ మరణం. న్యూజిలాండ్‌లో జన్మించిన బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త, అతను అణు భౌతిక శాస్త్ర పితామహుడిగా పిలువబడ్డాడు. అణువులలో శక్తితో కూడిన కేంద్రకం వుంటుందని కనిపెట్టాడు. రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.