- సంఘటనలు
1905 : అప్పటి భారత వైస్రాయ్ పరిపాలనా చర్యగా బెంగాల్ ప్రావిన్స్ ను రెండు గా విభజించాలని లార్డ్ కర్జన్ ప్రతిపాదించాడు.
1969 : భారతదేశంలో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి.
1969 : భారత లోక్‌సభ స్పీకర్ పదవి నుండి నీలం సంజీవరెడ్డి పదవి విరమణ చేశాడు.
2000: ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
2013 : భారతదేశ సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తిగా పళనిసామి సదాశివం పదవి బాధ్యతలు స్వీకరించాడు.
2022 : చరిత్రలో తొలిసారిగా డాలర్ తో రూపాయి మరకం విలువ 80 రూపాయలు దాటింది. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడం 10 ఏళ్లలో తొలిసారి.
- జననం
1827 : మంగళ్ పాండే జననం. భరతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, సిఫాయి.
1899 : పద్మ భూషణ్ బలాయ్ చంద్ ముఖర్జీ (బలాయ్ చంద్ ముఖోపాధ్యాయ) జననం. భారతీయ బెంగాలీ నవలా రచయిత, చిన్న కథా రచయిత, నాటక రచయిత, కవి, వైద్యుడు. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1909 : పద్మ భూషణ్ బాలమణి అమ్మ (నలపట్ బాలమణి అమ్మ) జననం. భరతీయ మలయాళ కవయిత్రి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. మలయాళ సాహిత్యానికి తల్లిగా ప్రసిద్ది చెందింది.
1924: చందమామ పత్రికను రూపొందించిన వ్యక్తులలో ఒకడు, "విక్రం, భేతాళ" కథలలో చిత్రాలు గీసిన చిత్రకారుడు కె సి శివశంకర్ జననం
1938 : పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ జననం. భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త, రచయిత.
1955 : రోజర్ మైఖేల్ హంఫ్రీ బిన్నీ జననం. భారతీయ బ్రిటిష్ క్రికెట్ క్రీడాకారుడు. 1983 ప్రపంచ క్రికెట్ కప్ విజేత జట్టులో భాగమైన భారతీయ క్రికెట్ ఆల్-రౌండర్.
1956 : నట కిరిటి రాజేంద్ర ప్రసాద్ (గద్దె రాజేంద్ర ప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.
1979 : మాళవిక (శ్వేతా కొన్నూర్ మీనన్) జననం. భారతీయ సినీ నటి.
1983 : సింధు తులాని (సింధు తొలని) జననం. భారతీయ రంగస్థల నటి, సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్.
చరిత్ర కొనసాగుతుంది..