- దినోత్సవం
కొలంబియా స్వాతంత్ర్య దినోత్సవం (స్పెయిన్ నుండి)
ప్రపంచ చదరంగం దినోత్సవం
అంతర్జాతీయ చంద్ర దినోత్సవం
- సంఘటనలు
1680 : మరాఠా సామ్రాజ్యం యొక్క 2వ ఛత్రపతి గా శంభాజీ భోసలే సింహాసనం అధిష్టించాడు.
1924 : అంటరానివారి ఇబ్బందులను తొలగించి, వారి మనోవేదనలను ప్రభుత్వం ముందు ఉంచడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొంబాయిలో "బాహిష్కృత హిట్‌కారిని సభ" ను స్థాపించారు.
1960 : పోలారిస్ క్షిపణి మొదటిసారి యుఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్ అనే జలాంతర్గామి నుండి విజయవంతంగా ప్రయోగించబడింది.
1969 : భారతదేశ తాత్కాలిక రాష్ట్రపతి పదవి నుండి వి వి గిరి పదవీ విరమణ చేశాడు.
1969 : భారత రాష్ట్రపతిగా మహ్మద్ హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
- జననం
1822 : జన్యుశాస్త్ర పితామహుడు, జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త గ్రెగర్ జోహన్ మెండెల్ జననం.
1898 : సంస్కృత పండితుడు, ఇండోలాజిస్ట్, పరోపకారి, పద్మశ్రీ మరియు పద్మ భూషణ్ గ్రహీత కృష్ణ కాంత హండిక్ జననం
1919 : టెన్సింగ్ నార్గే తో కలిసి మొట్టమొదటి సరిగా అత్యంత ఎత్తైన ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్న పర్వతారోహకుడు, అన్వేషకుడు ఎడ్మండ్ హిల్లరీ జననం.
1920: యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు లెవ్ సోలమోనోవిచ్ అరోనిన్ జననం
1933 : పద్మ విభూషణ్ రొద్దం నరసింహ జననం. భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ద్రవగతి శాస్త్రవేత్త, ప్రొఫెసర్. ఎస్ ఎస్ భట్నాగర్ అవార్డు గ్రహీత. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరెక్టర్.
1941 : లియాఖోవ్ సోయుజ్ 32, సోయుజ్ టి -9, మరియు సోయుజ్ టిఎమ్ -6 లలో కమాండర్, మరియు 333 రోజుల 7 గంటల 47 నిమిషాలు అంతరిక్షంలో గడిపిన ఉక్రేనియన్ సోవియట్ వ్యోమగామి వ్లాదిమిర్ అఫనాస్సేవిచ్ లియాఖోవ్ జననం
1947 : స్కానింగ్ టన్నెలింగ్ మైక్రోస్కోప్ యొక్క ఆవిష్కరణకు 1986 లో హెన్రిచ్ రోహర్ తో కలిసి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న జర్మన్ భౌతిక శాస్త్రవేత్త గెర్డ్ బిన్నిగ్ జననం
1950 : పద్మ భూషణ్ నసీరుద్దీన్ షా జననం. భరతీయ సినీ నటుడు, దర్శకుడు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత.
1956 : శ్రీలక్ష్మి (మానాపురం లక్ష్మీ పట్నాయక్) జననం. భరతీయ తెలుగు సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు సినీ సినీ నటుడు అమరనాథ్ కుమార్తె. సినీ నటుడు రాజేష్ సోదరి.
1968 : ఎస్ జె సూర్య (సమనసు జస్టిన్ సెల్వరాజ్) జాననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, గాయకుడు, స్క్రీన్ రైటర్, స్వరకర్త, నిర్మాత, సంగీత దర్శకుడు.
1969 : గిరిజా షెట్టర్ జననం. బ్రిటిష్ భారతీయ సినీ నటి, జర్నలిస్ట్, ఫిలాసఫర్, రచయిత్రి, నృత్యకారిణి.
1969 : కలిఖో పుల్ జననం. భారతీయ కూలీ, నాస్తికుడు, న్యాయవాది, రాజకీయవేత్త. అరుణాచల్ ప్రదేశ్ 8వ ముఖ్యమంత్రి.
1973 : నార్వే క్రౌన్ ప్రిన్స్, కింగ్ హరాల్డ్ V మరియు క్వీన్ సోంజా దంపతుల ఏకైక కుమారుడు, నార్వే సింహాసనం వారసుడు హాకాన్ మాగ్నస్ జననం.
1980 : గ్రేసీ సింగ్ జననం. భారతీయ సినీ నటి, నృత్యకారిణి, టెలివిజన్ ప్రజెంటర్.
1989 : ఉపాసన కొణిదెల (ఉపాసన కామినేని) జననం. భరతీయ వ్యాపారవేత్త, పరోపకారి, సామాజిక కార్యకర్త. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. ఫెమినా రికగ్నిషన్ ఇన్ హెల్త్‌కేర్ అవార్డు గ్రహీత. సినీ నటుడు రామ్ చరణ్ ను వివాహం చేసుకుంది.
1990 : సాక్షి అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్.
2012 : సితార ఘట్టమనేని జననం.
- మరణం
1937 : గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ మరణం. ఇటాలియన్ ఆవిష్కర్త, ఎలక్ట్రికల్ ఇంజనీర్.రేడియో ఆవిష్కర్త.
1951 : అబ్దుల్లా 1 (అబ్దుల్లా అల్లాహ్ అల్ బిన్ అల్-హుసేన్) మరణం. హాషెమైట్ రాజవంశం సభ్యుడు. జోర్డాన్ రాజ్య వ్యవస్థాపకుడు మరియు పాలకుడు.
1973 : బ్రూస్ లీ (లీ జున్ ఫాన్) మరణం. హాంకాంగ్ అమెరికన్ సినీ నటుడు, దర్శకుడు, మార్షల్ ఆర్టిస్ట్, మార్షల్ ఆర్ట్స్ బోధకుడు, తత్వవేత్త. యిప్ మ్యాన్ శిష్యుడు. 'జీత్ కునే డో' హైబ్రిడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిలాసఫీ స్థాపకుడు.
1991 : ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు చితిర తిరునాల్ బలరామ వర్మ మరణం
1996 : జస్టిస్ అన్నా చాందీ మరణం. భరతీయ న్యాయ నిపుణురాలు, సంపాదకురాలు, రాజకీయ కార్యకర్త. భారతదేశ మొదటి మహిళ న్యాయమూర్తి. 'మిసెస్' పత్రిక వ్యవస్థాపకురాలు.
2019 : షీలా దీక్షిత్ (షీలా కపూర్) మరణం. భరతీయ రాజకీయవేత్త. ఢిల్లీ 6వ ముఖ్యమంత్రి.
చరిత్ర కొనసాగుతుంది..