1820 : ఫ్రెడరిక్ ఎంగెల్స్ జననం. జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, రచయిత, రాజకీయ సిద్ధాంతవాది, తత్త్వవేత్త. కార్ల్ మార్క్స్ తోపాటు మార్క్సిజం (సోషలిజం) సిద్ధాంతానికి పితామహుడు. Continue reading “1820-11-28”
Event Type: జననం
1982-11-28
1982 : నోయెల్ సీన్ జననం. భారతీయ ర్యాప్ కళాకారుడు, స్వరకర్త, సినీ నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాత, గేయ రచయిత. టాలీవుడ్ లో మొదటి ర్యాపర్. స్వతంత్రంగా సంగీత నిర్మాత, రేడియో జాకీగా గుర్తింపు పొందాడు. అనంత శ్రీరామ్ తో కలిసి ‘ది షేక్ గ్రూప్’ తెలుగు బ్యాండ్‌ను ఏర్పాటు చేశాడు. తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
1927-11-28
1927 : పద్మశ్రీ ప్రమోద్ కరణ్ సేథీ జననం. భారతీయ ఆర్థోపెడిక్ సర్జన్. రామన్ మెగసెసే అవార్డు గ్రహీత. రామ్ చంద్ర శర్మతో కలిసి కృత్రిమ అవయవం ‘జైపూర్ ఫుట్’ ను కనిపెట్టాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించాడు. బ్రిటిష్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఫెలోగా ఎన్నికయ్యాడు. నటి సుధాచంద్రన్, కార్గిల్ యుద్దవీరులు, రెడ్ క్రాస్ సంస్థ కూడా ఈయన తయారు చేసిన కృత్రిమ కలునే వాడారు. Continue reading “1927-11-28”
1966-11-28
1966 : పుడిపెద్ది రవిశంకర్ జననం. భారతీయ నటుడు, డబ్బింగ్ కళాకారుడు, దర్శకుడు మరియు రచయిత. సాయి రవి అని కూడా పిలుస్తారు. అతను ప్రధానంగా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో కనిపిస్తాడు. ప్రముఖ నటుడు సాయి కుమార్ సోదరుడు. ఫిల్మ్ ఫేర్, నంది అవార్డులను అందుకున్నాడు.
1942-11-27
1942 : పద్మశ్రీ మృదుల సిన్హా జననం. భారతీయ రచయిత్రి, అధ్యాపకురాలు, రాజకీయవేత్త, విద్యావేత్త. గోవా 17వ గవర్నర్. గోవా గవర్నర్ గా పదవి పొందిన మొదటి మహిళ.
1907-11-27
1907 : పద్మ భూషణ్ హరివంశ్ రాయ్ బచ్చన్ (హరివంశ్ రాయ్ శ్రీవాత్సవ) జననం. భారతీయ కవి, రచయిత. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ‘బచ్చన్’ కలం పేరుతో కవిత్వం రాశాడు. సామాజిక కార్యకర్త ‘తేజ్వంత్ కౌర్ సూరి’ ని వివాహం చేసుకున్నాడు. సినీ నటుడు ‘అమితాబ్ బచ్చన్’ ఈయన కుమారుడే. Continue reading “1907-11-27”
1888-11-27
1888 : దాదాసాహెబ్ గణేష్ వాసుదేవ్ మావలంకర్ జననం. భారతీయ స్వాతంత్ర్య ఉద్యమకారుడు. భారత పార్లమెంట్ లోక్‌సభ మొదటి స్పీకర్. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అధ్యక్షుడు. భారత రాజ్యాంగ సభ స్పీకర్.
1975-11-27
1975 : సుచిత్రా కృష్ణమూర్తి జననం. భారతీయ సినీ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి, టెలివిజన్ ప్రజెంటర్. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ బాషలకు పనిచేసింది. అల్బుమ్స్ చేసింది. వెబ్ సిరీస్ లో పనిచేసింది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఈమె తన జీవిత చరిత్రను ‘డ్రామా క్వీన్’ రచించింది.
1977-11-27
1977 : ఉదయనిధి స్టాలిన్ జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి. ద్రవిడ మున్నేట్ర కజగం యువజన విభాగం కార్యదర్శి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ కుమారుడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు. సైమ, ఫిల్మ్ ఫేర్, నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులను అందుకున్నాడు.
1952-11-27
1952 : బంగా భూషణ్ బప్పి లహరి (అలోకేష్ లాహిరి) జననం. భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, స్వరకర్త, రాజకీయవేత్త. ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు గ్రహీత. డిస్కో కింగ్ బిరుదు పొందాడు. భారతదేశానికి డిస్కో సంగీతాన్ని పరిచయం చేశాడు. గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నాడు. Continue reading “1952-11-27”