1985 : సర్ సీవూసగూర్ రామ్‌గూలం మరణం. భారతీయ మారిషస్ వైద్యుడు, రాజకీయవేత్త, రాజనీతిజ్ఞుడు. చాచా, కేవాల్ అని కూడా పిలుస్తారు. ఆయన మారిష ద్వీపం యొక్క ఏకైక ముఖ్యమంత్రి, మొదటి ప్రధాన మంత్రి మరియు ఐదవ గవర్నర్ జనరల్‌గా పనిచేశాడు. పోర్ట్ లూయిస్ లార్డ్ మేయర్, లేబర్ పార్టీ నాయకుడు. ఆయన తండ్రి మోహీత్ రాంగూలం బీహార్ నుండి మారిష్ వెళ్ళిన వలస కార్మికుడు.
Event Type: మరణం
2014-12-15
2014 : చక్రి (గిల్లా చక్రధర్) మరణం. భారతీయ సిని సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత, సినీ నటుడు. Continue reading “2014-12-15”
1952-12-15
1952 : అమరజీవి పొట్టి శ్రీరాములు మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, విప్లవకారుడు. హరిజనుల ఆలయ ప్రవేశం కోసం నిరాహారదీక్ష చేసి సాధించాడు. ఆంధ్రరాష్ట్రం కోసం 56 రోజులు నిరాహారదీక్ష చేసి చనిపోయాడు. Continue reading “1952-12-15”
1950-12-15
1950 : భారతరత్న వల్లభాయ్ పటేల్ (వల్లభాయ్ ఝవేర్ భాయ్ పటేల్) మరణం. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త. భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి.
1971-12-14
1971 : పరమ్ వీర్ చక్ర నిర్మల్ జిత్ సింగ్ సెఖోన్ మరణం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, ఫ్లయింగ్ ఆఫీసర్. Continue reading “1971-12-14”
1986-12-13
1986 : పద్మశ్రీ స్మితా పాటిల్ మరణం. భారతీయ సిని నటి, టెలి నటి. హిందీ, మరాఠీ సినిమాలలో పనిచేసింది. దూరదర్శన్ లో వార్తలు చదివింది. స్త్రీవాద ఉద్యమకారిణిగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. సినీ నటుడు రాజ్ బబ్బర్‌ను పెళ్ళాడింది. 31వ యేట కాన్పు వల్ల కలిగిన సంక్లిష్టత కారణంగా మరణించింది. నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.
2019-12-12
2019 : గొల్లపూడి మారుతీ రావు మరణం. భారతీయ సినీ నటుడు, రచయిత, దర్శకుడు, నాటక రచయిత, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేకరి, టెలివిజన్ ప్రజెంటర్. నంది అవార్డు గ్రహీత. ‘గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్’ వ్యవస్థాపకుడు. తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. Continue reading “2019-12-12”
2012-12-11
2012 : భారతరత్న రవి శంకర్ (రబింద్రో శౌంకోర్ చౌదురి) మరణం. భారతీయ సితార వాద్యకారుడు, స్వరకర్త. Continue reading “2012-12-11”
2004-12-11
2004 : భారతరత్న ఎం ఎస్ సుబ్బలక్ష్మి (మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి) మరణం. భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, సినీనటి. భారతరత్న, రామన్ మెగసెసే, సంగీత కళానిధి పురస్కారాలు పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించింది. Continue reading “2004-12-11”
1896-12-10
1896 : ఆల్ఫ్రెడ్ బెర్న్‌హార్డ్ నోబెల్ మరణం. స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఆవిష్కర్త, వ్యాపారవేత్త. నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు. డైనమైట్ కనుగొన్నాడు. బోఫోర్స్ ఆయుధాల కంపెనీ యజమాని. కృత్రిమ మూలకము నోబెలియం కు ఈయన పేరు మీదునే నామకరణం చేసారు.