1994 : రీతికా సింగ్ (రితికా మోహన్ సింగ్) జననం. భారతీయ సినీ నటి, కిక్ బాక్సర్, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రమోషన్ సూపర్ ఫైట్ లీగ్ 11 విజేత. Continue reading “1994-12-16”
Event Type: జననం
1988-12-15
1988 : గీతా ఫోగట్ జననం. భారతీయ మహిళా కుస్తీ క్రీడాకారిణి, పోలీస్. కామన్ వెల్త్ ఆటల్లో ఇండియాకు మొట్టమొదటిసారి బంగారు పతకం తెచ్చిన ఏకైక క్రీడాకారిణి. ఒలెంపిక్స్ కు ఎంపికైన తొలి మహిళా కుస్తీ క్రీడాకారిణి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ (కాంస్య) పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామితురాలైంది. ఆమె తండ్రి, సోదరీమణులు కూడా విజయాలు సాధించారు. వీరిపై దంగల్ అనే సినిమా తీశారు. అర్జున అవార్డుతో సహ అనేక అవార్డులు అందుకుంది.
1933-12-15
పద్మశ్రీ
బాపు 🔴
(సత్తిరాజు లక్ష్మీనారాయణ)
జననం.
భారతీయ సినీ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్, స్క్రీన్ రైటర్, సంగీత కళాకారుడు.
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. Continue reading “1933-12-15”
1990-12-15
1990 : లావణ్య త్రిపాఠి జననం. భారతీయ సినీ నటి, మోడల్, డాన్సర్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, తమిళ, హిందీ భాషలలొ పనిచేస్తుంది. ఫైర్ & లవ్లీ, బినాని సిమెంట్ లాంటి వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె టెలివిజన్ షో ప్యార్ కా బంధన్‌తో తన కెరీర్‌ను ప్రారంభించింది. అందాల రాక్షసి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు అందుకుంది.
1924-12-14
1924 : పద్మ భూషణ్ రాజ్ కపూర్ (సృష్టి నాథ్ కపూర్) జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత. రణబీర్ రాజ్ కపూర్, రాజ్ సాహెబ్, షో మేన్ ఆఫ్ బాలీవుడ్, భారతీయ చార్లీ చాప్లిన్ పేర్లు కలిగిఉన్నాడు. Continue reading “1924-12-14”
1978-12-14
1978 : సమీరా రెడ్డి జననం. భారతీయ సినీ నటి. పంకజ్ ఉధాస్ యొక్క “ఔర్ ఆహిస్తా” మ్యూజిక్ వీడియోతొ గుర్తింపు పొందింది. 2012లో మిస్ శ్రీలంక ఆన్‌లైన్ పోటీకి న్యాయనిర్ణేత. Continue reading “1978-12-14”
1984-12-14
1984 : రాణా (దగ్గుబాటి రామానాయుడు) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత. నంది అవార్డు గ్రహీత. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కుమారుడు. ఫోర్బ్స్ ఇండియా 100లో స్థానం పొందాడు. Continue reading “1984-12-14”
1982-12-14
1982 : ఆది పినిశెట్టి (పినిశెట్టి సాయి ప్రదీప్) జననం. భారతీయ సినీ నటుడు. సినీ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు. Continue reading “1982-12-14”
1928-12-13
1928 : పద్మశ్రీ డివిఎస్ రాజు (దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు) జననం. భారతీయ సినీ నిర్మాత. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో కీలకపాత్ర పోషించాడు. నేషనల్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ కు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా వ్యవహరించాడు. ఫిల్ం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. రఘుపతి వెంకయ్య అవార్డు, భీష్మ అవార్డు, పద్మశ్రీ లతో గౌరవించబడ్డాడు.
1989-12-13
1989 : టేలర్ అలిసన్ స్విఫ్ట్ జననం. అమెరికన్ గాయని, గేయరచయిత, సినీనటి. ఆమె మొదటి ఆల్బమ్ ‘టేలర్ స్విఫ్ట్’ అని తన పేరుతోనే విడుదల చేసింది. అవి ఒక మిలియన్ కంటే ఎక్కువ అమ్ముడుపోయాయి. అత్యంత గూగుల్ చేయబడిన సంగీతకారిణి. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన 100 మహిళలలో 64వ స్థానం పొందింది. అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్, అమెరికన్ కంట్రీ, ఎఎంఎఫ్డి, ఆపిల్ మ్యూజిక్, బీబీసి మ్యూజిక్ అవార్డులతో సహ అనేక అవార్డులు పొందింది.