జననం – పేజీ 154 – On This Day  

1980-12-11

1980 : ఆర్య (జంషాద్ సెతిరకాత్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, టెలివిజన్ ప్రజెంటర్. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలొ పనిచేశాడు. సినీనటి సయేషా ను వివాహం చేసుకున్నాడు. సైమ, ఫిల్మ్‌ఫేర్ సౌత్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకున్నాడు.

1995-12-11

1995 : మిస్ ఇంటెలెక్చువల్ నభా నటేష్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, కన్నడ భాషలలొ పనిచేస్తుంది. ఫెమినా మిస్ ఇండియా టాప్ 10 ర్యాంకర్. సింహగడ్ ఫెమినా మిస్ ఇంటెలెక్చువల్ విజేత. వజ్రకాయ సినిమాతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసింది. మీడియాలో “ఇస్మార్ట్ బ్యూటీ” గా పేరు పొందింది.

1980-12-10

1980 : ది న్యూ ఏజ్ యాక్షన్ హీరో విద్యుత్ దేవ్ సింగ్ జమ్వాల్ జననం. భారతీయ సినీ నటుడు, మార్షల్ ఆర్టిస్ట్, స్టంట్‌మ్యాన్, యాక్షన్ కొరియోగ్రాఫర్, మోడల్, టెలివిజన్ ప్రజెంటర్. Continue reading “1980-12-10”

1878-12-10

1878 : భారతరత్న రాజాజీ (చక్రవర్తి రాజగోపాలాచారి) జననం. భారతీయ రాజనీతిజ్ఞుడు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య ఉద్యమకారుడు. పశ్చిమ బెంగాల్ మొదటి గవర్నర్. మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. Continue reading “1878-12-10”

1880-12-10

1880 : సి ఆర్ రెడ్డి (కట్టమంచి రామలింగారెడ్డి) జననం. భారతీయ సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది, ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు. ఆంధ్ర యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. Continue reading “1880-12-10”

1982-12-10

1982 : మిర్చి శివ (శివ సుందరం) జననం. భారతీయ తమిళ సినీ హాస్యనటుడు, రేడియో జాకీ, రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత, టెలివిజన్ ప్రజెంటర్. రేడియో మిర్చిలో రేడియో జాకీగా పనిచేశాడు. 13బి సినిమాతో ఆరంగేట్రం చేశాడు. చిరకాల స్నేహితురాలు మరియు మాజీ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రియను వివాహం చేసుకున్నాడు.

1964-12-10

1964 : పద్మశ్రీ జయరామ్ సుబ్రమణ్యం జననం. భారతీయ సినీ నటుడు, తబలా వాద్యకారుడు, మిమిక్రీ కళాకారుడు, నేపథ్య గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, మలయాళం, తమిళ భాషలలొ పనిచేశాడు. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్ అవార్డు, ఏషియా ఫిల్మ్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకున్నాడు.

1985-12-10

1985 : కామ్నా జఠ్మలానీ జననం. భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషలలొ పనిచేసింది. 2004లో మిస్ ముంబై కాంటెస్ట్‌లో రన్నరప్‌గా నిలిచింది. బాంబే వికింగ్ ఆల్బమ్ లో కనిపించింది. ప్రేమికులు తెలుగు సినిమా తో  సినీరంగ ప్రవేశం చేసింది.

1945-12-09

1945 : శత్రుఘ్న ప్రసాద్ సిన్హా జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, నిర్మాత, రాజకీయవేత్త. Continue reading “1945-12-09”

1946-12-09

1946 : సోనియా గాంధీ (ఎడ్విజ్ ఆంటోనియా అల్బినా మైనో) జననం. ఇటాలియన్ భారతీయ రాజకీయవేత్త. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు. భారతదేశ ప్రధానమంత్రి పదవిని తిరస్కరించింది. Continue reading “1946-12-09”